: నీతా అంబానీకి 'వై' కేటగిరీ భద్రత!


రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీకి ‘వై’ కేటగిరి భద్రత లభించనుంది. ఈ కేటగిరీ కింద సీఆర్పీఎఫ్ జవాన్లు మొత్తం 20 మంది ఆమెకు ఇరవైనాలుగు గంటలూ రక్షణగా ఉంటారు. కేంద్ర హోంశాఖ అనుమతితో పెయిడ్ సెక్యూరిటీ సర్వీస్ పొందిన ఆమె ఇందుకు అయ్యే ఖర్చంతా భరించనునన్నారు. ఐపీఎల్ లో టీ20 ఫ్రాంచైజీ కలిగి ఉన్న ఆమె పలు సేవా కార్యక్రమాలతో పాటు ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆమెకు రక్షణ కల్పించాలన్న వినతి మేరకు కేంద్ర హోం శాఖ 'వై' కేటగిరి భద్రతకు అనుమతినిచ్చింది. కాగా, ‘రిలయన్స్’ అధినేత ముఖేశ్ అంబానీ ప్రస్తుతం జడ్ కేటగిరి భద్రతలో ఉన్నారు. ఈ భద్రత కింద నలభై మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రతిక్షణం కనిపెట్టుకుని ఉంటారు.

  • Loading...

More Telugu News