: హరీష్ పచ్చి అబద్ధాలు చెబుతుంటే ఏమీ చేయలేకపోతున్న చంద్రబాబు రాజీనామా చేయాలి: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి


ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు గతంలోనివని, వాటికి ఇదివరకే అనుమతులు వచ్చాయని చెబుతూ, తెలంగాణ మంత్రి హరీశ్ రావు పచ్చి అబద్ధాలు చెబుతూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. విషయం తెలిసి కూడా కేసులకు భయపడి చంద్రబాబు సర్కారు, ప్రాజెక్టులను అడ్డుకునే యత్నం కూడా చేయడం లేదని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులకు అనుమతులు ఉంటే వాటిని చూపించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ రైతులకు పెను సాగునీటి కష్టాలను తెచ్చి పెట్టే ఈ ప్రాజెక్టులను అడ్డుకోలేకపోతే చంద్రబాబు రాజీనామా చేయాలని అన్నారు.

  • Loading...

More Telugu News