: హమ్మయ్య... తెలంగాణలో ఓ ఆంధ్రా పార్టీ మాయమైపోయింది: కేటీఆర్


తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగి, ఏకైక పార్టీగా నిలిచే రోజు ఎంతో దూరంలో లేదని ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి ఓ ఆంధ్రా పార్టీ మొత్తం మాయమైపోయిందని అన్నారు. ఈ మధ్యాహ్నం వైకాపా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి, ఆయన్ను స్వయంగా తెరాసలోకి ఆహ్వానించిన కేటీఆర్, అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో వైకాపాకు ఒక్క శాసనసభ్యుడు కూడా మిగల్లేదని, ఇక తెలుగుదేశానికి ఇదే గతి పట్టే రోజు తొందర్లోనే రానుందని, ఆ పార్టీ సైతం మాయం కానుందని కేటీఆర్ విమర్శించారు. ఎంపీ పొంగులేటితో పాటు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేరికతో, ఖమ్మం జిల్లాలో తెరాస మరింతగా బలపడనుందని అంచనా వేశారు.

  • Loading...

More Telugu News