: బెంగళూరులో దారుణం...కళ్లముందే యువతిని ఎత్తుకెళ్లినా ఎవరూ స్పందించలేదు!


బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన ఓ యువతి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తోంది. డ్యూటీ ముగిసిన అనంతరం హాస్టల్ వద్దకు చేరుకున్న యువతి, రొడ్డుపై స్నేహితురాలితో ఫోన్ లో మాట్లాడుతుండగా, ఓ దుండగుడు ఆమెను బలవంతంగా లాక్కువెళ్లాడు. దగ్గర్లోని ఓ నిర్మానుష్య భవనంలోకి తీసుకెళ్లిన దుండగుడు ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. యువతి గట్టిగా అరుస్తుండడంతో ఆమెను గాయపరిచి, పరారయ్యాడు. దీంతో షాక్ కు గురైన ఆమె గత పది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రాత్రి 9:50 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. అక్కడే కొంత మంది ఉన్నప్పటికీ ఆమెను కాపాడే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో నమోదు కావడంతో, ఈ పుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై కర్ణాటక హోం మంత్రి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News