: ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు వృథా ఖర్చులు వద్దు: ఆర్ఎస్ఎస్


ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తం డబ్బులను వృథాగా ఖర్చు చేస్తున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మండిపడింది. సాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తం భారీ మొత్తాల్లో డబ్బులు ఖర్చు చేయడానికి బదులు ఆ సొమ్మును ఆరోగ్యం, విద్యా సంబంధమైన సౌకర్యాల కల్పనకు వినియోగించాలని ఆలయ నిర్వాహకులకు ఆర్ఎస్ఎస్ సూచించింది. ఆర్ఎస్ఎస్ పబ్లిసిటీ విభాగం ఇన్ ఛార్జి జె.నందకుమార్ మాట్లాడుతూ, ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాల పేరిట మిమిక్రీ షోలు, టపాసులు కాల్చడం, ఫిల్మ్ షో, ఊరేగింపులు వంటి వాటికి అనవసర ఖర్చులు చేయవద్దని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట నిర్వహించేవి అసభ్యంగా ఉండకూడదని సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News