: నేను కోరుకున్న డిజైనర్ వేదికపైనే పెళ్లి చేసుకున్నా!: బిపాసా బసు
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం చాలా ప్రత్యేకమైనది. ప్రధానంగా యువతులకు వివాహంపై ఎన్నో ఆలోచనలు, కోరికలు ఉంటాయి. అందర్లాగే బాలీవుడ్ నటి బిపాసా బసుకు కూడా ఎన్నో కలలు ఉండేవి. దీంతో వివాహం దగ్గరపడుతున్న కొద్దీ వివాహ వేదిక ఎలా ఉండబోతోంది? తను కోరుకున్నట్టు వివాహ వేదిక ఉంటుందా? లేదా? అన్న బెంగ ఉండేది. ఈ అనుమానాలన్నింటికీ డిజైనర్ తనాజ్ పూర్తి సహకారం అందించారు. బిపాసా ఎలా కోరుకుందో అలాంటి వివాహ వేదిక, అతిథులు కూర్చునే ప్రదేశం తదితరాలను డిజైన్ చేశారు. దీంతో బిపాసా ఎంతో ఆనందంగా శనివారం సహనటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను వివాహం చేసుకుంది. ఈ సందర్భంగా తన వివాహ వేదిక ఫోటోలను ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసి ఆనందం వ్యక్తం చేసింది. వేదిక ఇలా ఉండాలని నెల రోజులుగా ఆరాటపడ్డానని, తన కోరిక తీర్చిన తనాజ్ కు ధన్యవాదాలని ఆమె చెప్పింది.