: ఉపరాష్ట్రపతికి తీవ్ర ఆగ్రహం కలిగిన వేళ..!
పదేపదే రాజ్యసభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు శేఖర్ రాయ్ పై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సభ నుంచి బయటకు వెళ్లాలని, ఈ రోజు తిరిగి సభలో అడుగు పెట్టరాదని ఆదేశించారు. అంతకుముందు, అగస్టా చాపర్ల కుంభకోణంలో చర్చకు ఆయన నోటీసును ఇవ్వగా, దాన్ని తిరస్కరిస్తున్నట్టు అన్సారీ ప్రకటించారు. దీనిపై పట్టువీడని శేఖర్ రాయ్, రక్షణ మంత్రి పారికర్ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ, నినాదాలు చేస్తుండటంతో పలుమార్లు వారించిన అన్సారీ చివరకు తన సహనాన్ని కాసేపు పక్కన పెట్టారు. శేఖర్ ను బయటకు వెళ్లిపోవాలని గట్టిగానే చెప్పారు. శేఖర్ వెళ్లిపోయిన తరువాత చైర్మన్ తీరును నిరసిస్తూ, టీఎంసీ సభ్యులు వాకౌట్ చేశారు.