: నాకు స్ఫూర్తి, బలం అభిమానులే: బిగ్ బీ అమితాబ్ బచ్చన్
తనకు స్ఫూర్తి నిచ్చేది, ముందుకు నడిపించేది అభిమానులేనని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అభిమానుల ప్రేమ, అనురాగాన్ని మాటల్లో చెప్పలేమని, తనకు అండగా ఉంటూ ఎంతో అభిమానాన్ని చూపుతున్నారని అన్నారు. తనకు ఇంతగా బలాన్నిస్తున్న అభిమానుల ప్రేమ స్వచ్ఛమైందని అమితాబ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.