: డాక్టర్ రాసలీలలని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన భార్య
కర్నూలు జిల్లా నంద్యాలలో శ్రీహర్ష ఆసుపత్రి యజమాని డాక్టర్ రాఘవరెడ్డి రాసలీలలను అతని భార్య వినీత రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టించిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...రాఘవరెడ్డి స్త్రీలోలుడని అతని భార్య చెబుతోంది. వివాహం జరిగిన 18 ఏళ్ల నుంచి అతని ఆగడాలు భరించలేకపోతున్నానని ఆమె పేర్కొంది. ఎన్నిసార్లు మందలించినా ఉపయోగం ఉండడం లేదని, తన కుమారుడు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తుండడంతో ఇంత కాలం మౌనంగా భరించానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అతనితో అనుబంధం పెంచుకున్న మహిళను ఇంటికి తీసుకురావడంతో తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె అన్నారు. దీంతో పోలీసులు అతని ఇంటిలోనే రెడ్ హ్యాండెడ్ గా వారిద్దరినీ పట్టుకుని నిలదీశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని అతని భార్య డిమాండ్ చేస్తోంది.