: చీమలు కుట్టలేదు.. పసికందు మృతికి వేరే కారణం ఉంది: వైద్యులు
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని మెటర్నిటీ వార్డులో చీమలుకుట్టి నాలుగురోజుల చిన్నారి మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఆ చిన్నారిని చీమలు కుట్టలేదని వైద్యులు చెప్పుకొస్తున్నారు. చిన్నారిపై చీమలు కుట్టినట్లు ఉన్న గాయాలకు వైద్యులు వేరే కారణాన్ని చెబుతున్నారు. పోస్టుమార్టం జరిపిన అనంతరం నిజం తెలుస్తుందని అంటున్నారు. మరోవైపు ఆసుపత్రిలో నిర్లక్ష్యం ఎక్కువగా ఉందని అక్కడ చికిత్స తీసుకుంటోన్న రోగులు, వారి బంధువులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు ఆసుపత్రి నిర్లక్ష్యంపై సిబ్బందిని పలుసార్లు హెచ్చరించారని అయినా వారి తీరు మారలేదని అంటున్నారు. చిన్నారి మృతితో పలువురు రాజకీయ నాయకులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.