: విమానం నడిపేటప్పుడు సీట్‌లో ఎలా కూర్చోవాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?: సినిమా కోసం కార్తీ శిక్షణ
తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తీ, తాజాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. దీంట్లో మణిరత్నం కార్తీని పైలట్ పాత్రలో చూపించనున్నారు. ఆ పాత్రలో ఒదిగి పోవడానికి కార్తీ ప్రస్తుతం పైలట్ గా శిక్షణ తీసుకుంటున్నాడట. ఫ్లైయింగ్ లో అనుసరించాల్సిన వ్యూహాలు, పైలట్‌గా కూర్చునే తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ పొందుతున్నాడట. శిక్షణ అనంతరం డైరెక్టుగా షూటింగ్ మొదలు పెట్టేయాలని కార్తీ భావిస్తున్నాడు. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. వచ్చేనెల నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కార్తీ మునుపెన్నడూ కనిపించని సరికొత్త లుక్ లో కనిపిస్తుండడం, విజయం కోసం కసిగా ఉన్న మణిరత్నం సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుండడం వంటి అంశాలతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.