: మాయన్ రహస్యాలు ఇంకా అంతుచిక్కట్లేదు
మాయన్ నాగరికతకు ప్రపంచంలో అతి పురాతన గొప్ప నాగరికతల్లో ఒకటిగా పేరుంది. దేవాలయాల నిర్మాణం, భాషకు ఒక రాత, గణిత, ఖగోళ శాస్త్రాల ఆవిష్కరణ వంటి అనేక అంశాల పరంగా మాయన్ నాగరికతకు పేరుంది. అయితే దీని పుట్టుకకు సంబంధించి మాత్రం ఇంకా రహస్యాలు ముడి వీడడం లేదు. మనం ఊహిస్తున్న దానికంటె మాయన్ నాగరికత సంక్లిష్టమైనదని తాజాగా ఈ విషయంలో పరిశోదనలు చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాయన్ గురించి ఇప్పటికి రెండు సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి. ప్రస్తుత గ్వాటెమాలా , దక్షిణ మెక్సికోలో ఒకప్పటి అడవుల్లో ఇది పుట్టిందని కొందరు అంటుండగా, పురాతన ఆల్మెక్ నాగరికత, దాని కేంద్రమైన లావెంటా ప్రభావం వల్ల అభివృద్ధి చెందిందని కొందరు అంటున్నారు.
అయితే అరిజోనా యూనివర్సిటీకి చెందిన దంపతులు తకేషి ఇనోమటా, డేనియాలా త్రియాడన్ ల పరిశోధనలో ఈ రెండూ కూడా పూర్తి వివరాలు చెప్పడం లేదని తేలింది. గ్వాటెమాలా లోని సెయిబాల్ లో తవ్వకాలు చేపట్టిన వీరు ఈ విషయం చెబుతున్నారు. తొలినాటి మాయన్ కల్చర్ రహస్యాలు మన ఊహలకంటె సంక్లిష్టంగా ఉన్నాయని పరిశోధనలో పాల్గొన్న విక్టర్ క్యాస్టిలో చెబుతున్నారు.