: ఆకట్టుకుంటోన్న బ్రహ్మోత్సవం టీజర్... తనను పెళ్లి చేసుకోవాలని ప్రిన్స్ మహేష్ బాబును కోరుతున్న ఎనిమిదేళ్ల పాప!


అవును, మీరు చదివింది నిజమే. పట్టుమని ఎనిమిదేళ్లు కూడా ఉండని ఓ పాప, మహేష్ బాబును పెళ్లాడమని కోరుతోంది. నిజ జీవితంలో కాదులెండి. మహేష్ తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'లో. ఆరడుగులున్న అందమైన మహేష్ నడిచొస్తుంటే, అడ్డుగా వచ్చిన పాప, మహేష్ ను ఆపి, తన మెడలో తాళి కట్టాలన్నట్టు సైగ చేస్తుంది. పాపను చూసి ముగ్ధుడైన మహేష్, బుగ్గలు చిదిమి తన దారిన తాను వెళ్లిపోతాడు. ఇంత అందమైన దృశ్యాన్ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చిత్రీకరించిన తీరు అద్భుతమని టీజర్ ను చూసిన వారు ప్రశంసిస్తున్నారు. తొలి టీజర్ లో 'వచ్చింది కదా అవకాశం... ఓ మంచి మాట అనుకుందాం' అనే పాటను పరిచయం చేసిన శ్రీకాంత్, తాజా టీజర్ లో 'మధురం మధురం' అంటూ సాగే పాటను పరిచయం చేశాడు. ఇప్పుడీ టీజర్ దూసుకెళుతోంది.

  • Loading...

More Telugu News