: ట్రంప్ మరో వివాదాస్పద వ్యాఖ్య... 'రేప్' పదం వాడుతూ చైనాపై విమర్శలు
అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన చైనాను టార్గెట్ గా చేసుకున్నారు. అమెరికాను చైనా 'రేప్' చేస్తోందని, ఇకపై దాన్ని అనుమతించబోమని అన్నారు. యూఎస్ లో వాణిజ్య లోటు పెరిగేందుకు చైనా కారణమని ఆరోపిస్తూ, ఆ దేశం నుంచి ఎగుమతుల్లో అమెరికాదే పెద్ద వాటా అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన 'రేప్' పదాన్ని వాడుతూ, అమెరికా వ్యాపారాన్ని చైనా బలవంతంగా ఆక్రమిస్తోందని, గత పాలకుల అసమర్థతే ఇందుకు కారణమని ఆరోపించారు.