: సీబీఐ ఆఫీస్ కు క్యూ కట్టిన మీడియా... కెమెరాలను తోసేసుకుంటూ లోపలికెళ్లిన త్యాగి


ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం ముందు కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఆ పార్టీని ఇరుకునపెట్టేసిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగి నేటి ఉదయం సీబీఐ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. త్యాగి అక్కడకు రాకముందే భారీ సంఖ్యలో అక్కడ గుమికూడిన మీడియా ప్రతినిధులు... త్యాగిని తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్శంగా అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. మీడియా ప్రతినిధులను చూసి కాస్తంత అసహనం వ్యక్తం చేసిన త్యాగి కెమెరాలను పక్కకు తోసేసుకుంటూ సీబీఐ ఆఫీస్ లోకి వెళ్లిపోయారు. అగస్టా కుంభకోణంలో వెల్లువెత్తిన ఆరోపణలపై సీబీఐ అధికారులు త్యాగిని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News