: చంద్రబాబు, కరవు... కవల పిల్లలు!: తిరుపతి ధర్నాలో రోజా ఘాటు వ్యాఖ్య


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోమారు విరుచుకుపడ్డారు. కరవుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా వైసీపీ కొద్దిసేపటి క్రితం ఏపీ వ్యాప్తంగా పోరుబాటను ప్రారంభించింది. ఇందులో భాగంగా తిరుపతిలో జరిగిన ధర్నాలో పాల్గొన్న సందర్భంగా రోజా... చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, కరవులను కవల పిల్లలుగా ఆమె అభివర్ణించారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా రాష్ట్రంలో కరవు వస్తుందని ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబుకు కరవుపై ముందు చూపు లేదన్న రోజా,... సీఎంకు ఉన్నదంతా మొండిచూపేనని దుయ్యబట్టారు. కరవుతో అల్లాడుతున్న జనాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు... విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకే సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఎండలు మండిపోతుంటే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు కరవయ్యాయని విమర్శించారు. భానుడి వేడితో సతమతమవుతున్న జనానికి ఉపశమనం కోసం ఏర్పాటు చేస్తామన్న మజ్జిగ కేంద్రాలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News