: ప్రేమించినవాడితో పెళ్లి చేయాలని కోరుతున్న కేసీఆర్ దత్తపుత్రిక!
తల్లిదండ్రుల చేత తీవ్ర హింసలు ఎదుర్కొని, శరీరమంతా గాయాలతో ఆసుపత్రిలో చేరి, ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా కదిలొచ్చేలా చేసిన ప్రత్యూష గుర్తుందా? ప్రత్యూషను దత్తత తీసుకుంటున్నట్టు, ఆమె యోగక్షేమాలను తానే స్వయంగా పరిశీలిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు కూడా. ప్రస్తుతం ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం సంరక్షణలో ఉన్న ప్రత్యూష ఇప్పుడు తనను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటోంది. ఓ అటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన యువకుడిని తాను పెళ్లి చేసుకుంటానని ప్రత్యూష అధికారులకు చెప్పగా, వారు కేసీఆర్ కార్యాలయానికి సమాచారం అందించారు. ఈ విషయంలో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.