: తృణమూల్ కార్యకర్తలపై బాంబులతో దాడి చేసిన కాంగ్రెస్... నలుగురు మృతి!


ఎన్నికలు ముగిసిన తరువాత పశ్చిమ బెంగాల్ లోని మాల్దా ప్రాంతంలో హింస చలరేగింది. కాంగ్రెస్, తృణమూల్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ తీవ్ర హింసాత్మకంగా మారగా, నలుగురు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. కాంగ్రెస్ నేతలు బాంబులను విసిరారని, ఈ కారణంతోనే తమవారు మరణించారని తృణమూల్ ఆరోపించగా, కాంగ్రెస్ దాన్ని ఖండించింది. కాగా, గత శనివారంతో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు జరుగుతున్న వేళ, పలు ప్రాంతాల్లో హింస చెలరేగగా, మొత్తం 186 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్ తో పాటు ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల ఫలితాలూ ఈ నెల 19న వెలువడనున్నాయి.

  • Loading...

More Telugu News