: కెనడాలో కాల్పుల కలకలం... తెలంగాణ యువతి దుర్మరణం


ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశం కెనడాలో శుక్రవారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని కాల్పులతో విరుచుకుపడ్డ దుండగుడి దాడిలో తెలంగాణకు చెందిన యువతి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకెళితే... తెలంగాణలోని పాలమూరు జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ లోని క్రిస్టియన్ కాలనీకి చెందిన వైద్యుడు జాన్ కృపాకరం 16 ఏళ్ల కిందటే కుటుంబంతో కలిసి కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె కింతియా జాన్ (24) ఇటీవలే పీజీ పూర్తి చేసి అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. శుక్రవారం రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి షాపింగ్ కు వెళ్లిన కింతియా... షాపింగ్ ముగించుకుని కారెక్కుతుండగా ఓ దుండగుడు కాల్పులతో విరుచుకుపడ్డాడు. కింతియా స్నేహితుడు జోసెఫ్ ను టార్గెట్ చేసిన దుండగుడు జరిపిన కాల్పుల్లో జోసెఫ్ తో పాటు కింతియా కూడా తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించేలోగానే వారిద్దరూ ప్రాణాలు వదిలారు.

  • Loading...

More Telugu News