: తెలంగాణలో నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు!... సర్కార్ చెల్లించాల్సిన బకాయిలే కారణమట!


తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. సింగిల్ పైసా తీసుకోకుండా ఉచితంగానే కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రారంభమైన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు పేదల పాలిట సంజీవనే అని చెప్పాలి. పేదల నుంచి నయా పైసా తీసుకోకుండానే వైద్య చికిత్సలు అందించే ఆసుపత్రులకు ప్రభుత్వం నిర్దేశిత బిల్లులను చెల్లించాల్సి ఉంది. అయితే గడచిన కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తోంది. వెరసి ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు రూ.600 కోట్లకు పైగా పేరుకుపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో బిల్లులు చెల్లించకపోతే... ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని ఇటీవల ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. అయినా ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు నిన్న ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆగమేఘాల మీద కదిలిన ప్రభుత్వం వీలయినంత త్వరలో బిల్లులు చెల్లిస్తామని, సేవలను నిలపొద్దని ఆసుపత్రులను కోరింది. ప్రభుత్వ విజ్ఞప్తిని పెడచెవిన పెట్టిన ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేశాయి. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే సేవలను పున:ప్రారంభిస్తామని తేల్చి చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News