: ప్రజల కోసం మినహా... దేనికీ రాజీపడే సమస్యే లేదు: మేడే వేడుకల్లో చంద్రబాబు ప్రకటన


మేడే ఉత్సవాలను పురస్కరించుకుని నిన్న విజయవాడలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనపై వెల్లువెత్తుతున్న విమర్శలపై నిప్పులు చెరిగారు. ప్రజల కోసం మినహా... మరే విషయంలోనూ రాజీ పడే ప్రశ్నే లేదని ఆయన తేల్చిచెప్పారు. ‘‘ప్రత్యేక హోదా విషయంలో నేను రాజీపడ్డానని కొందరు విమర్శిస్తున్నారు. నేను దేని కోసమూ రాజీ పడను. ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో మన ఎంపీలు 29 మంది ఉన్నారు. అయినా నాడు మంత్రి పదవి ఆశించలేదు. ఈనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మనవారు కేంద్ర మంత్రులుగా ఉన్నారే తప్ప మంత్రి పదవులు ఆశించి కాదు. ఈ విషయం నన్ను విమర్శించే వారు గుర్తుంచుకోవాలి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News