: ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతంలో 24 గంటల్లో నాలుగింతలైన మంటలు
ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు 24 గంటల్లో నాలుగింతలైంది. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన కార్చిచ్చు అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. వేడిగాలులు, ఎండల ప్రభావంతో అటవీ ప్రాంతాన్ని మంటలు భస్మీపటలం చేస్తున్నాయి. మంటలను చల్లార్చేందుకు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో మంటలు నాలుగింతలు పెరిగాయి. ఈ మేరకు ఇస్రో విడుదల చేసిన శాటిలైట్ ఛాయాచిత్రాలు మంటల తీవ్రతను చూపుతున్నాయి. దీంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎంఐ-17 హెలికాప్టర్లను రంగంలోకి దించింది. వీటి సాయంతో మంటలను నియంత్రణలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.