: ఇకపై ఫ్యాన్స్ తో ఫోటోలు దిగను: హాలీవుడ్ నటి


సినీ నటులు సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తారు. కానీ ఓ హాలీవుడ్ నటి మాత్రం ఎందుకీ సెలబ్రిటీ హోదారా బాబూ? అని తలపట్టుకుంటోంది. అంతటితో ఆగకుండా భవిష్యత్ లో ఫ్యాన్స్ తో ఫోటోలు దిగనని ఆమె స్పష్టం చేసింది. ఇటీవల అమెరికాలోని సౌత్ కరోలినాలోని గ్రీన్ విల్లేలో నడుచుకుంటూ వెళ్తున్న హాలీవుడ్ హాస్యనటి యామీ షుమర్ వద్దకు ఓ అభిమాని దూసుకువచ్చాడు. సెల్పీ తీసుకుంటానని బలవంతపెట్టాడు. అతను యామీ ముఖంపై కెమెరా పెట్టడంతో ఆమె మండిపడింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు అభిమాని, నీ కోసం డబ్బులు ఖర్చుచేస్తున్నానంటూ వాగ్వాదానికి దిగాడు. దీంతో ఒళ్లు మండిన యామీ అతని ఫోటోను ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. జరిగిన సంఘటన మొత్తం వివరించింది. 'ఇకపై అభిమానులతో ఫోటోలు దిగను' అని స్పష్టం చేసింది. అనవసరంగా సెలబ్రిటీ హోదా వచ్చిందని వాపోయింది!

  • Loading...

More Telugu News