: ఆ జంట పేలుళ్లు మా పనే!: ఐఎస్ఐఎస్
ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఇరాక్ లో పంజావిసిరారు. రెండు చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడి పదుల సంఖ్యలో ప్రాణాలు హరించి, పదుల సంఖ్యలో క్షతగాత్రులను చేశారు. తొలుత సమోవా నగరంలో ప్రభుత్వ కార్యాలయం దగ్గర యాత్రికులను లక్ష్యం చేసుకుని పేల్చిన బాంబు దాడిలో 33 మంది మృతి చెందారు. అనంతరం దానికి కొద్ది దూరంలో ఉన్న బస్టాండ్ వద్ద మరోబాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 40 మంది క్షతగాత్రులయ్యారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు హుటాహుటీన సంఘటనా స్థలికి చేరుకుని, సహాయకచర్యలు ప్రారంభించాయి. కాగా, ఈ పేలుళ్లకు తామే బాధ్యులమని ఐఎస్ఐఎస్ ప్రకటించింది.