: ఛోటా రాజన్ ను జైల్లోనే లేపేస్తాం: జైలు అధికారులకు బెదిరింపుల ఎస్ఎంఎస్
ఇండోనేసియాలోని బాలిలో పట్టుకుని, భారత్ కు తరలించిన అండర్ వరల్డ్ మాఫియా డాన్ ఛోటా రాజన్ ను లేపేస్తామంటూ రెండోసారి బెదిరింపులు వచ్చాయి. తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఛోటా రాజన్ ను ఎన్నాళ్లు జైలులో ఉంచి రక్షించగలరని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ప్రధాన అనుచరుడు చోటా షకీల్ సెల్ నెంబర్ నుంచి ఓ మెసేజ్ తీహార్ జైలు సీనియర్ అధికారి సునీల్ గుప్తా ఫోన్ నెంబర్ కు వచ్చింది. గతంలో తీహార్ జైలు ల్యాండ్ లైన్ నెంబర్ కు ఇలాంటి బెదిరింపులు రావడంతో ఛోటా రాజన్ కు భద్రతను పెంచారు. అతని బ్యారక్ కు పహారా కాసేందుకు అదనపు సిబ్బందిని కేటాయించారు. ఈ నేపధ్యంలో ఆయనను ఎంత కాలం రక్షించగలరంటూ, తాము అతనిని జైలులోనే లేపేస్తామని మెసేజ్ రావడంతో పోలీసులు మరోసారి అప్రమత్తమయ్యారు.