: 10 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన చిట్ నిర్వాహకురాలు!


చిట్ నిర్వాహకురాలు 10 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన హైదరాబాదులో వెలుగు చూసింది. మహబూబ్ నగర్ కు చెందిన అరుణారెడ్డి అనే మహిళ నేరేడ్ మెట్ లో నివాసం ఉంటూ చుట్టుపక్కల వారి డబ్బుతో చిట్ లు నిర్వహించేది. ఆమె భర్త రఘునాథ్ రెడ్డి వడ్డీ వ్యాపారం నిర్వహించేవారు. వీరి దగ్గర చిట్ వేసిన వారు పాడుకున్నప్పటికీ 3 రూపాయల వడ్డీ ఆశ చూపి, ఆ డబ్బులు వారి వద్దే ఉంచుకునేవారు. ఇలా సుమారు వంద మందికి 10 కోట్ల రూపాయల వరకు ఆ దంపతులు బాకీ పడ్డారు. కాగా, గత సోమవారం అరుణా రెడ్డి, ఆమె భర్త రఘునాథ్ రెడ్డి, వారి కుమార్తెతో కలిసి ఇల్లు విడిచి వెళ్లిపోయారు. బాధితులు వారిని ఫోన్ లో కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాలేదు. దీంతో వారు నేరేడ్ మెట్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న అరుణా రెడ్డి కుటుంబాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News