: 'బాహుబలి' బాబు 'కబాలి'...ఫస్ట్ డే నాలుగు షోలు చూస్తా: రాంగోపాల్ వర్మ
వివాదాస్పద వ్యాఖ్యల దర్శకుడు రాంగోపాల్ వర్మ రజనీకాంత్ నటిస్తున్న 'కబాలి' సినిమాను ఆకాశానికెత్తేస్తున్నాడు. కబాలి టీజర్ విడుదలైన కొద్ది సేపట్లోనే హిట్లు, షేర్లతో దూసుకుపోతోంది. దీంతో దీనిపై ట్విట్టర్ ద్వారా వర్మ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు. 'బాహుబలి' బాబులా 'కబాలి' సినిమా ఉంటుందని అంటున్నాడు. ఒక్క రజనీకాంత్ తప్ప ఇంకే సూపర్ స్టార్ కూడా వెండితెరను వైబ్రేట్ చేయలేరని వర్మ పేర్కొన్నాడు. కబాలి సినిమా విడుదలైన రోజే నాలుగు షోలు చూస్తానని కూడా ముందుగానే ప్రకటించేశాడు.