: మలాలాకు నోబెల్ బహుమతి ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు: 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' రవి శంకర్


పాకిస్థాన్ యువతి మలాలా యూసుఫ్ జాయ్ కి నోబెల్ బహుమతి ఇవ్వడాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' ప్రబోధకుడు శ్రీశ్రీ రవిశంకర్ వ్యతిరేకించారు. కేవలం రాజకీయ కారణాలవల్లే ఆమెకు నోబెల్ పురస్కారం అందేశారని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో తనకు నోబెల్ పురస్కారం ఇస్తానన్నప్పటికీ తిరస్కరించానని ఆయన చెప్పారు. రాజకీయ ప్రమేయం పెరగడం వల్ల తాను దానిని తిరస్కరించానని ఆయన పేర్కొన్నారు. తాను పనిచేయడాన్ని నమ్ముతానని, చేసిన పనిని గౌరవించడాన్ని మాత్రం విశ్వసించనని ఆయన చెప్పారు. మలాలాకు నోబెల్ పురస్కారం ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఆమెకు నోబెల్ పురస్కారం ఇచ్చినందువల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అర్హులైన వారికి మాత్రమే నోబెల్ పుస్కారం ఇవ్వాలని ఆయన సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News