: పవన్ కల్యాణ్ తో నా చిత్రం ఎలా ఉంటుందంటే..: దాసరి కబుర్లు


పెద్ద హీరోలతో తాను చిత్రాలు చేసే అవకాశం లేకపోయినా, ముందనుకున్నట్టుగా పవన్ కల్యాణ్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తానని దర్శకరత్న దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. ఆ సినిమా పొలిటికల్ సెటైర్ గా మాత్రం ఉండబోదని, ఆ సినిమాకు తాను నిర్మాతను మాత్రమేనని అన్నారు. ఆ సినిమా సోషల్ మెసేజ్ తో కూడిన కమర్షియల్ చిత్రమని తెలిపారు. పవన్ కల్యాణ్ గ్రేట్ అని ఇప్పటికీ చెబుతానని, ఓ కమిట్ మెంట్ ఉన్న వ్యక్తని, తానేమనుకున్నా చేస్తాడని కితాబిచ్చారు. పవన్ మానవతా దృక్పథంతో వ్యవహరిస్తాడని, తన చిత్రం ఫ్లాప్ అయితే, డిస్ట్రిబ్యూటర్లకు కొంత డబ్బు తిరిగి ఇస్తానని తనంతట తానుగా వెల్లడించిన మనసున్న వ్యక్తని అన్నారు. లంకేశ్వరుడు చిత్రం షూటింగ్ సమయంలో తనతో పూర్తి స్థాయిలో పనిచేశాడని గుర్తు చేసుకున్నారు. తనకు, చిరంజీవికీ మధ్య వివాదాన్ని మీడియా సృష్టిస్తోందని, సందర్భానుసారం కొన్ని కామెంట్లు వస్తుంటాయని, వాటిని మీడియా అతిగా చూపిస్తుందని అన్నారు. చిరంజీవి తనకు దగ్గరి బంధువని, తమ మధ్య అగాధాలు లేవని తెలిపారు.

  • Loading...

More Telugu News