: పెద్ద హీరోలతో సినిమాలు చెయ్యలేనేమో!: దాసరి


ఇకపై భవిష్యత్తులో పెద్ద హీరోలతో తాను సినిమాలను నిర్మించలేనేమోనని దర్శకరత్న దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు దర్శకుడు తయారు చేసుకుని వచ్చిన కథే మూలాంశంగా, హీరో అందులో భాగంగా ఉండేవారని, ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. తనకు ఎదురుకాని ఎన్నో అనుభవాలను ఇప్పటి నిర్మాతలు, దర్శకులు ఎదుర్కోవాల్సి వస్తోందని విమర్శించారు. చిన్న హీరోలు సైతం మ్యూజిక్ సిట్టింగ్స్ నుంచి నిర్మాణంలో తమ పాత్ర వుండాలని కోరుతున్నారని అన్నారు. హీరోల ప్రమేయం అధికం కావడం పరిశ్రమకు అంత మంచిది కాదని తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలోని టాప్ హీరోలతో తన దర్శకత్వ శైలి సరిపడదని అన్నారు. 1000 థియేటర్లలో రిలీజ్ చేయగల సినిమాలు లేవని, 700 థియేటర్లకే చిత్రాలు పరిమితమని వెల్లడించిన ఆయన, ప్రస్తుతం చెబుతున్న ట్రేడ్ లెక్కలు అవాస్తవాలని అన్నారు. తన సినిమా ఇంత వసూలు చేసిందని ఏ నిర్మాతా చెప్పడని, లెక్కలన్నీ మీడియా సృష్టేనని తెలిపారు. వాపును చూసి బలం అనుకోకూడదని హెచ్చరించారు. హీరో, హీరోయిన్, దర్శకుడికి ఇచ్చే రెమ్యునరేషన్ పక్కన పెడితే, సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎప్పుడూ ఫిక్స్ డ్ గా ఉంటుందని, ఆ లెక్కలు అందరికీ తెలుసునని వివరించారు. తన ఆడియన్స్ ఇప్పుడు సినిమాలకు రాని కారణంగానే చిత్రాలను తీయడం లేదని దాసరి తెలిపారు.

  • Loading...

More Telugu News