: కబాలీ ట్రైలర్ అదుర్స్, నిమిషాల్లో లక్షల్లో హిట్స్... మీరూ చూడండి!


కలైపులి ఎస్ థానూ సమర్పణలో, రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలీ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలై, నెట్టింట దూసుకెళుతోంది. చుట్టూ సెక్యూరిటీ మధ్య రజనీ తనదైన స్టయిల్ లో నడిచి రావడం, ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన ముఖాముఖిలో "అవును, నువ్వేనా గ్యాంగ్ స్టర్?" అని అడిగిన ప్రశ్నకు తన కళ్లద్దాలను తీస్తూ రజనీ నవ్వడం, రెండు పోరాట దృశ్యాలు ఇందులో ఉన్నాయి. రజనీ చెప్పిన ఓ డైలాగ్ కూడా ఉంది. కబాలీ తెలుగు టీజర్ విడుదల కావాల్సి వుంది. ఈ వీడియోను 11 గంటల సమయంలో విడుదల చేయగా, దాదాపు 60 వేల 'లైక్'లను, అంతే మొత్తంలో 'షేర్'లతో సత్తా చాటింది.

  • Loading...

More Telugu News