: ఒబామా దంపతులతో డిన్నర్ చేసిన ప్రియాంక, ట్విట్టర్ లో ఫోటో!


బాలీవుడ్ అందాల నటి ప్రియాంకా చోప్రా, వైట్ హౌస్ లో శనివారం రాత్రి జరిగిన అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇచ్చిన వార్షిక డిన్నర్ లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒబామా, మిషెల్ దంపతులతో కలిసి విందారగించిన ప్రియాంక, వారితో కలసి దిగిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంది. అమెరికా అధ్యక్ష దంపతులతో భోజనం చేయడం తనకు సంతోషాన్ని, గర్వాన్ని కలిగించిందని తెలిపింది. కాగా, ఈ డిన్నర్ కు ఫ్యాషన్ డిజైనర్ జుహైర్ మురాద్ ప్రత్యేకంగా తయారు చేసిన బ్లాక్ డ్రస్ వేసుకుని హాజరైన ప్రియాంక, అందరి చూపులనూ తనవైపు తిప్పుకుంది.

  • Loading...

More Telugu News