: విజయవాడలో అర్ధరాత్రి రామాలయం తొలగింపు... తీవ్ర ఉద్రిక్తత!


రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్నాయన్న కారణంతో విజయవాడలో చిన్న రామాలయం, దాని పక్కనే ఉన్న దర్గాలను కార్పొరేషన్ అధికారులు తొలగించడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. భవానీపురంలోని భాష్యం పాఠశాల సమీపంలోని ప్రార్థనాలయాలను గత రాత్రి పోలీసుల సాయంతో కార్పొరేషన్ అధికారులు తొలగించారు. దీన్ని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా, పెద్దఎత్తున అక్కడికి వచ్చిన పోలీసులు వారిని నిలువరించారు. ఇరు వర్గాలకు చెందిన వారు గుంపులుగా అక్కడికి రావడంతో ఉద్రిక్తత పెరుగుతుందన్న కారణం చూపుతూ, పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని స్టేషన్ కు తరలించారు. ఆ ప్రాంతంలో ప్రజల నిరసన కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News