: కెనడాలో హైదరాబాద్ యువతిపై కాల్పులు...మృతి


కెనడాలో దుండగులు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన ఓ యువతి దుర్మరణం పాలైంది. హైదరాబాద్ కు చెందిన త్రింతియా జాన్ అనే యువతి అక్కడి ఓ షాపింగ్ మాల్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. తుపాకీతో మాల్ లోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో, త్రింతియా తీవ్రంగా గాయపడి మరణించింది. ఓ ఐటీ కంపెనీలో త్రింతియా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు దుండగుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు. కాల్పుల వెనుక కారణం ఏంటన్న విషయం తెలియరాలేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News