: వెనెజులా ఉద్యోగులకు వారంలో రెండు రోజుల పని దినాలు!
తీవ్ర వర్షాభావం, కరవు, కరెంటు కొరతతో అల్లాడిపోతున్న వెనెజులా ప్రభుత్వం, మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడు వారాంతపు సెలవులను అమలు చేస్తున్న సర్కారు, తాజాగా, మరో రెండు రోజుల సెలవులను ప్రకటించింది. అంటే వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే ఉద్యోగులు పనిచేయాల్సి వుంటుంది. దేశంలోని 28 లక్షల ఉద్యోగులకు రెండు రోజుల పనిదినాల నిబంధన అమలవుతుందని తెలిపింది. ఇటీవల దేశ కాలగమనాన్ని సైతం అరగంట ముందుకు జరిపిన అధ్యక్షుడు నికోలస్ మడురో నేతృత్వంలోని ప్రభుత్వం నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సాయపడాలని, విజ్ఞప్తి చేస్తున్నారు. షాపింగ్ మాల్స్, ప్రైవేట్ సంస్థలు తదితరాలు ఆలస్యంగా కార్యాలయాలను తెరచి, త్వరగా మూసివేయడం ద్వారా కరెంటును ఆదా చేయాలని పిలుపునిచ్చారు.