: నాలుగో విడత రుణమాఫీ జాబితా విడుదల... స్వయంగా విడుదల చేయనున్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో విడత రుణమాఫీ జాబితా సిద్ధమైంది. ఈ జాబితాను రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తొలి విడత ప్రయోజనం పొందిన రైతులకు నాలుగు విడతల అర్హతా పత్రాలను జారీ చేయనున్నట్టు తెలిపాయి. ఈ తాజా జాబితాలో ఉద్యానవన రుణమాఫీ అర్హుల జాబితా ఉంటుందని సమాచారం. అర్హతా పత్రాల పంపిణీ ఈ నెల రెండో వారం నుంచి మొదలు పెట్టాలని కూడా నిర్ణయించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ పత్రాల పంపిణీ పూర్తయిన తరువాత రెండో విడత రుణమాఫీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News