: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ
నూతన ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నగారా మోగించింది. మొత్తం 1477 పోస్టుల భర్తీకి షెడ్యూల్ ను విడుదల చేసింది. గత సంవత్సరం 9 ప్రకటనలు జారీ చేయగా, గ్రూప్-2 మినహా మొత్తం 2,626 పోస్టుల భర్తీని న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా టీఎస్ పీఎస్సీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయ విస్తరణాధికారుల విభాగంలో 1000 పోస్టులు, రవాణా శాఖలో 137 కానిస్టేబుల్ పోస్టులు, అబ్కారీ శాఖలో 340 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టుల భర్తీకి ఈ నెల 4 నుంచి 19 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, వీరికి జూన్ 4న పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. రవాణా, అబ్కారీ శాఖల్లో ఉద్యోగాలు పొందగోరేవారు 4 నుంచి 30 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి పరీక్ష ఎప్పుడు నిర్వహించాలన్న విషయాన్ని తరువాత నిర్ణయిస్తామని అన్నారు.