: క్యాన్సర్‌ కణాలను అడ్డుకునే కెఫీన్‌


కాఫీలో కెఫీన్‌ అనే మత్తు పదార్థం ఉంటుందని.. అది మన ఆరోగ్యానికి అంతో ఇంతో హాని కలుగజేస్తుందని మనం అనేక అధ్యయనాల్లో చదివే ఉంటాం. అందులో నిజం లేదనలేం గానీ.. అదే కెఫీన్‌కు క్యాన్సర్‌ కణాలను అడ్డుకునే శక్తి కూడా ఉంటుందిట. క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న వారు రోజులో ఎక్కువ సార్లు కాఫీ సేవిస్తూ ఉంటే.. రోగాన్ని అడ్డుకునే సామర్థ్యం పెరుగుతుందిట.

ప్రత్యేకించి రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న వారు.. టామోక్సిఫెన్‌ అనే మందు తీసుకుంటారు. ఆ మందు తీసుకునే వారు రోజుకు రెండు కప్పులకు పైగా కాఫీ తాగడం మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనివల్ల వారిలో మందు ప్రభావం మెరుగ్గా కనిపిస్తోందిట. 600 మంది క్యాన్సర్‌ బాధితుల్ని అయిదేళ్లపాటూ పరిశీలించిన స్వీడన్‌ శాస్త్రవేత్తలు ఈ విషయం నిగ్గు తేల్చారు. కాఫీ అనేది టామోక్సిఫెన్‌ సామర్థ్యాన్ని పెంచుతుందని అంటున్నారు.

  • Loading...

More Telugu News