: ‘కాంకర్’లో పాకిస్తానీ నటులు అద్భుతంగా నటిస్తున్నారు: విద్యాబాలన్
జిందగీ ఛానెల్ లో ప్రసారమవుతున్న పాకిస్తానీ సీరియల్ ‘కాంకర్’లో నటీనటులు అద్భుతంగా నటిస్తున్నారని బాలీవుడ్ భామ విద్యాబాలన్ కితాబు ఇచ్చింది. మేరి హర్జాయ్, ఏక్ మెహబ్బత్ కే బాద్ డ్రామాల రచనా శైలి అద్భుతంగా ఉందని చెప్పింది. ఈ సీరియల్స్ లో ముఖ్యంగా స్త్రీ పాత్రలు తనకు తెగనచ్చేశాయంది. మేకప్ తో పాటు, వారి నటన తనను కట్టిపడేస్తోందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ సీరియల్స్ చూడ్డం ఈమధ్యనే తనకు అలవాటైందని ‘డర్టీ పిక్చర్’ చిత్రంలోని ‘ఊలాలా ఊలాల..’ పాటతో కుర్రకారును ఊపేసిన విద్యాబాలన్ సెలవిచ్చింది.