: మీరు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు: అభిమానులకు రోహిత్ శర్మ లేఖ


అభిమానులు లేకపోతే ఈరోజు తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ అన్నాడు. 29వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోహిత్ తన అభిమానులకు భావోద్వేగమైన ఒక లేఖ రాశాడు. పేపర్ పై రాసిన ఈ లేఖను రోహిత్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. క్రికెట్ లో పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా తనను ఆదరిస్తున్న, మద్దతుగా నిలుస్తున్న అభిమానులందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. అభిమానులు చూపిన అభిమానమే తన ప్రపంచమని రోహిత్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News