: ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదనడం సరికాదు: సీఎం చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అవసరం లేదనడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్టణంలో ఈరోజు జరిగిన ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, మిగతా రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు ఏపీని కేంద్రం ఆదుకోవాలని అన్నారు. ఏకపక్షంగా విభజన చేసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి కేంద్రానికి ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన మండిపడ్డారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాయనున్నట్లు చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News