: రాష్ట్రపతి పర్యటన.. ముక్కుముక్కూ రాస్తూ ఘన స్వాగతం!
ఈరోజు న్యూజిలాండ్ చేరుకున్న భారత రాష్ట్రపతి ప్రణబ్ కు అక్కడి సంప్రదాయాల ప్రకారం మావోరీ పద్ధతిలో ఘన స్వాగతం లభించింది. ప్రత్యేక వస్త్రధారణలో ఉన్న మావోరీ వారియర్స్ నృత్యాలు చేశారు. అనంతరం మావోరీ వారియర్స్ కి చెందిన ఒక పురుషుడు, ఒక మహిళ తమ ముక్కులను ప్రణబ్ ముక్కుకు రాస్తూ స్వాగతం పలికారు. అనంతరం ప్రణబ్ ను తీసుకుని అక్కడి గవర్నమెంట్ హౌస్ కు న్యూజిలాండ్ గవర్నర్ జనరల్ సిర్ జెర్రీ మటెపరే వెళ్లారు. కాగా, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్ పర్యటనల నిమిత్తం ప్రణబ్ వెళ్లారు. పపువా న్యూ గినియా పర్యటన ముగిసిన అనంతరం అక్కడి నుంచి న్యూజిలాండ్ కు ఈరోజు మధ్యాహ్నం బయలుదేరి వెళ్లారు.