: చంద్రబాబు, జగన్ తమ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రాజెక్టులను విమర్శిస్తున్నారు: హరీశ్‌రావు ఆగ్రహం
ప్రజల కష్టాలను గట్టెక్కించేలా తాము చేపట్టిన ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శిస్తున్నారని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తూ రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీలు రాజకీయ విమర్శలు చేసుకుంటూ, మధ్యలో తెలంగాణ ప్రాజెక్టులను ఉపయోగించుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రజా క్షేమాన్ని కోరుకునే వారు పాలమూరు ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటారని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నడిచిన బాటలోనే జగన్ నడుస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. చంద్రబాబు, జగన్ తెలంగాణ ప్రాజెక్టుల జోలికి రావద్దని సూచించారు.