: లిఫ్ట్‌లో ఒంటరిగా చిక్కిందని చేయివేశాడు.. యువతి ఇచ్చిన పంచ్‌కి కుప్పకూలాడు!
లిఫ్ట్‌లో ఒంటరిగా చిక్కిందని యువతిపై ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. అయినా యువతి సైలెంట్ గా ఉందని ఏకంగా భుజంపై చేయివేసేశాడు. దీంతో కోపానికి గురైన యువతి ఆ ఆకతాయిని కుమ్మేసింది. యువతి ఇచ్చిన పంచ్ దెబ్బకి కుప్పకూలి లిఫ్ట్ లోనే పడిపోయాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీ కెమెరాలో చిక్కాయి. రాత్రి సమయంలో లిఫ్ట్‌లో ఉన్న చైనాకు చెందిన ఓ యువతి తనపై చేయి వేసిన కామాంధుడిపై ఈ ధైర్యాన్ని చూపించింది. లిఫ్ట్ లో ఒంటరిగా ఉన్న యువతి వద్దకు వచ్చిన యువకుడు మొదట ఆమె వెనక నిలబడి అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి పక్కకు జరిగింది. యువతిని అమాయకురాలిగా భావించిన ఆ యువకుడు మళ్లీ రెచ్చిపోయే ప్రయత్నం చేశాడు. ఈ సారి ఏకంగా ఆ యువతిపై చేయివేశాడు. దీంతో ఒక్కసారిగా తిరగబడిన చైనా యువతి.. ఆ కామాంధుడిపై పిడిగుద్దులు గుద్దింది. చెప్పుకోలేని చోట కాలితో తన్నింది. దీంతో ఆ యువకుడు లిఫ్ట్‌లోనే పడిపోయాడు. సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియో వైరల్ అయింది