: అభిమానిపై బాడీగార్డ్ పంచ్.. ట్విట్టర్‌లో క్షమాపణలు కోరిన అక్షయ్ కుమార్
ఇటీవల ముంబై ఎయిర్ పోర్టులో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో సెల్ఫీ కోసం ప్రయత్నిస్తోన్న ఓ అభిమానిపై బాడీగార్డ్ చేయిచేసుకున్నాడు. ఈ ఘటనపై అక్షయ్ కుమార్ తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తన అభిమానిని క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపాడు. అభిమానిపై చేయి చేసుకున్న బాడీగార్డ్‌ని హెచ్చరించానని తెలిపాడు. అభిమానులపై తన బాడీగార్డ్‌లు దురుసుగా ప్రవర్తించకుండా ఇక జాగ్రత్త పడతానని పేర్కొన్నాడు. తాను ఆ రోజు ఈ విషయాన్ని గమనించలేదని చెప్పాడు. తన అభిమానిని క్షమించమని కోరుతున్నానని ట్వీట్ చేశాడు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అభిమాని ముఖంపై అక్షయ్ బాడీగార్డ్ పంచ్ విసిరిన దృశ్యాలు మీడియా కెమెరాకి చిక్కాయి. దీనిపై విమర్శలూ వచ్చాయి. అయితే, అక్షయ్ కుమార్ ఈ ఘటనపై క్షమాపణలు కోరడంతో నెటిజన్లు అక్షయ్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటున్నారు.