: పాకిస్థాన్‌కు వెళ్లిన మోదీని త‌ప్పు ప‌ట్ట‌లేదు కానీ, నేను ఆ దేశం గురించి మాట్లాడితే వివాదమా..? : టీఎంసీ నేత‌


‘పాకిస్థాన్‌కు వెళ్లిన ప్రధాని మోదీని త‌ప్పు ప‌ట్ట‌లేదు కానీ, నేను ఆ దేశం గురించి మాట్లాడితే వివాదమా..?’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత బాబీ ఫర్హాద్ హకిమ్ సంచ‌లన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో ఐదో ద‌శ ఎన్నిక‌లు ఈరోజు కొనసాగుతోన్న విష‌యం తెలిసిందే. అయితే ఎన్నిక‌లు ప్రారంభం అవ‌డానికి కొన్ని గంట‌ల ముందు ఓ పాకిస్థాన్ ప‌త్రిక‌కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న త‌న నియోజ‌క వ‌ర్గ‌మైన గార్డెన్ రీచ్ ను మినీ పాకిస్థాన్ గా అభివ‌ర్ణించారు. ప‌త్రిక‌లో ప్ర‌చురితమైన ఆ ఆర్టిక‌ల్‌ను నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా షేర్ చేసేశారు. దీంతో నెటిజన్లు ఫర్హాద్ హకిమ్ వ్యాఖ్యలను విమర్శిస్తూ, ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ నేత‌ల నుంచి కూడా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆయ‌న త‌న వ్యాఖ్యలను స‌మ‌ర్థించుకుంటూ మ‌ళ్లీ వివాదాస్ప‌దంగా మాట్లాడారు. మోదీ ఏకంగా పాకిస్థాన్‌కే వెళుతున్నార‌ని, తాను కేవలం ఆ దేశం గురించి మాట్లాడాన‌ని.. మోదీపై వివ‌ర్శ‌లు చేయ‌నివారు, త‌న‌పై ఎందుకు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. అంతేకాదు తాను ముస్లిం కావడం వల్లే తన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News