: ఏపీలో కొనసాగుతున్న భానుడి ప్రతాపం.. నిప్పుల గుండాన్ని తలపిస్తోన్న వాతావరణం
ఆంధ్రప్రదేశ్‌లో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. రాష్ట్రం నిప్పుల గుండాన్ని తలపిస్తోంది. కోస్తాంధ్ర, రాయలసీమలో చాలా చోట్ల ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటి నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఏపీలో అత్యధికంగా జంగమహేశ్వరపురం, అనంతపురంలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప మధ్యాహ్నం వేళ బయట సంచరించకుండా ఉంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.