: మధుమేహంతో బాధపడుతున్నారా? అయితే, డార్క్‌ చాక్లెట్ తీసుకోండి!


మధుమేహంతో బాధపడుతోన్న వారికి లండన్ లోని వార్విక్ యూనివర్శిటీ పరిశోధకులు ఓ శుభ‌వార్త‌ చెప్పారు. ప్రతిరోజూ వంద గ్రాముల డార్క్ చాక్లెట్ తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. అంతేకాదు, డార్క్ చాక్లెట్ తీసుకోవ‌డంతో హృద్రోగ సమస్యలనుంచి కూడా ఉప‌శ‌మ‌నం పొందే అవ‌కాశాలు ఉన్నాయని అంటున్నారు. వార్విక్ యూనివర్శిటీ పరిశోధకులు 1153 మందిని ఎంపిక చేసుకొని నిర్వహించిన పరిశోధ‌న‌ల్లో ఈ విషయాన్ని గుర్తించారు. డార్క్ చాక్లెట్‌తో లివర్ లోని ఎంజైములు వృద్ధి చెందుతాయ‌ని క‌నుగొన్నారు. తద్వారా ఇన్సులిన్ నియంత్ర‌ణ జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. ఈ చాక్లెట్‌ను ప్ర‌తీరోజు తీసుకొనే వారిలో ఉత్సాహం కూడా క‌నిపించింద‌ని తెలిపారు. హృద్రోగ స‌మ‌స్యల‌కు దూరంగా ఉండ‌డానికి కూడా ఈ చాక్లెట్ ఉపయోగ‌ప‌డుతుంద‌ని చెప్పారు. లండన్ లోని వార్విక్ యూనివర్శిటీ జరిపిన ఈ ప‌రిశోధ‌న‌ 18 నుంచి 69 ఏళ్ల మధ్య ఉన్న వ్య‌క్తుల‌పై చేశారు.

  • Loading...

More Telugu News