: ‘హోదా’ కోసం మూడు రోజుల దీక్ష ... మే 16న కర్నూలులో చేపడతానని జగన్ ప్రకటన


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో దీక్షకు సిద్ధమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టనున్న ఈ దీక్షకు రాయలసీమ ముఖద్వారం కర్నూలు వేదికగా మారనుంది. వచ్చే నెల (మే) 16న కర్నూలులో మొదలు కానున్న జగన్ దీక్ష మూడు రోజుల పాటు కొనసాగి అదే నెల 18న ముగియనుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని లోటస్ పాండ్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్వయంగా జగనే ఈ దీక్షకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ఏపీ కష్టాలను కళ్లారా చూస్తూ కూడా కేంద్రం ఏమాత్రం కనికరం లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రకటించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన చంద్రబాబు ప్రభుత్వ తీరును కూడా ఈ సందర్భంగా ఆయన తూర్పారబట్టారు.

  • Loading...

More Telugu News