: కాల్పులతో దద్దరిల్లిన శేషాచలం కొండ... ‘ఎర్ర’ దొంగల దాడిలో కానిస్టేబుల్ కు గాయాలు


తిరుమల వెంకన్న కొలువై ఉన్న శేషాచలం కొండల్లో మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని మామండూరు వద్ద నేటి ఉదయం ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు...పోలీసులపై ఎదురు దాడికి దిగారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిన్న రాత్రి నుంచి అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేటి ఉదయం మామండూరు సమీపంలో పోలీసులకు కూలీలు తారసపడ్డారు. వారి వెంట కొందరు చోటా మోటా స్మగ్లర్లు కూడా ఉన్నట్లు సమాచారం. కూలీల అలికిడిని గమనించిన పోలీసులు మెరుపు దాడి చేసి ఓ కూలీని అదుపులోకి తీసుకున్నారు. ఊహించని పరిణామంతో క్షణాల్లో తేరుకున్న స్మగ్లర్లు, కూలీలు... పోలీసులపైకి ఎదురు దాడి చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పులతో భీతిల్లిన కూలీలు, స్మగ్లర్లు తమ వెంట తెచ్చుకున్న దుంగలను అక్కడే వదిలేసి కాల్పులు జరుపుతూనే పారిపోయారు. కూలీల కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు.

  • Loading...

More Telugu News